Goodnews for Anganwadi workers: అంగన్వాడీల గ్రాట్యుటీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:01 PM
Goodnews for Anganwadi workers: రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారి రిటైర్మెంట్ వయస్సు, గ్రాట్యూటిని పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

అమరావతి, మార్చి 7: ఏపీలో (Andhrapradesh) అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం (AP Govt) శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచుతూ జీవో జారీ చేసింది. అలాగే రిటైర్మెంట్ తరువాత గ్రాట్యుటీని కూడా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ హెల్పర్లకు 1 లక్ష రూపాయలు, వర్కర్లకు 40 వేల గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించింది. సర్కార్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో 1 లక్ష 20 వేల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ఈరోజు (శుక్రవారం) జీఓ నెంబర్ 8ని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి జారీ చేశారు. ప్రభుత్వం నిర్ణయంతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. దీనిలో భాగంగా అంగన్వాడీల వయస్సు, గ్రాడ్యుటీని పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి గతంలోనే అనధికారికంగా ప్రకటించినప్పటికీ అధికారికంగా ఉత్తర్వుల ద్వారా శుభవార్త చెప్పింది. అంగన్వాడీల రిటైర్మెంట్ వయస్సును పెంచుతూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రిటైర్మెంట్ తర్వాత వచ్చే గ్రాడ్యుటీని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి ముందు మృతి చెందిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల అంతిమసంస్కారాల కోసం రూ.15 వేల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా అంగన్వాడీల రిటైర్మెంట్, గ్రాడ్యుటీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పెద్ద ఊరట అనే అంగన్వాడీలు చెప్పుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
CBI: వివేకా వాచ్‌మన్ రంగయ్య మృతిపై కేసు నమోదు
Janasena leaders criticize Ambati: వైసీపీ పాకిస్థాన్.. కూటమి ఇండియా.. జనసేన నేతల ఫైర్
Read Latest AP News And Telugu News