Share News

Amaravati Sports City: క్రీడలకు అధిక ప్రాధాన్యత: మంత్రి అనిత

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:26 AM

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సారిగా పోటీలు జరగటం శుభ పరిణామమని మంత్రి అనిత అన్నారు. పవర్ లిఫ్టింగ్‌తో పాటు, యోగా పోటీలను నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

Amaravati Sports City: క్రీడలకు అధిక ప్రాధాన్యత: మంత్రి అనిత
Amaravati Sports City

అమరావతి, అక్టోబర్ 13: అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha), డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈరోజు (సోమవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు రెండు ప్రాంతాల్లో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోలీసుల క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గత ఏడాది ఈ పోటీలు ప్రారంభించామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సారిగా పోటీలు జరగటం శుభ పరిణామమన్నారు. పవర్ లిఫ్టింగ్‌తో పాటు, యోగా పోటీలను నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.


యోగాలో రాష్ట్రం గిన్నిస్ బుక్ సాధించిన సంగతి తెలిసిందే అని అన్నారు. రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి 1011 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నారని మంత్రి అనిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే

టీడీపీలోకి వచ్చిన ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 13 , 2025 | 11:37 AM