Kadapa: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..
ABN , Publish Date - Aug 10 , 2025 | 04:35 PM
మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు. వారి నుంచి ఒక టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
కడప: గత కొంతకాలంగా జిల్లా పోలీసులుకు నిద్రలేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగ దస్తగిరితో పాటు మరో ఐదుగురు స్మగ్లర్లను మైదుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అరెస్ట్ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు.
మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు. వారి నుంచి ఒక టన్ను ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అరెస్టులో.. మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ఇరగంరెడ్డి నాగదస్తగిరి రెడ్డి పట్టుబడినట్లు తెలిపారు. నాగదస్తగిరిపై ఇప్పటికే 86 ఎర్రచందనం కేసులు, 34 చోరీ కేసులు, 3 పీడీ యాక్టు కేసులు ఉన్నాయని తెలిపారు. అతని భార్య లాలుబీని కూడా వారం క్రితం పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అశోక్ వెల్లడించారు. నాగదస్తగిరిని అరెస్ట్ చేసిన మైదుకూరు పోలీసులను ఎస్పీ అభినందించారు.
కొండా మురళితో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. ఎందుకంటే..
ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్