AP High Court: సీసీ కెమెరాల ఏర్పాటుపై డీజీపీ, జైళ్ల శాఖ డీజీకి హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 09:35 PM
AP High Court: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారా? అని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసింది. అలాగే పోలీస్టేషన్లలో ఆ ప్రాంగణమంతా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా? అని ప్రశ్నించింది. ఈ అంశాలను పరిశీలించి రాష్ట్ర స్థాయిలో ఐటీ విభాగాన్ని చూసే ఉన్నతాధికారికి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

అమరావతి, ఫిబ్రవరి 17: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లు, జైళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పని చేయని వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం కానీ వాటికి మరమ్మతులు చేయడానికి ఏమి చర్యలు తీసుకున్నారని అడిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారా? అని ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసింది. అలాగే పోలీస్టేషన్లలో ఆ ప్రాంగణమంతా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? లేదా? అని ప్రశ్నించింది. ఈ అంశాలను పరిశీలించి రాష్ట్ర స్థాయిలో ఐటీ విభాగాన్ని చూసే ఉన్నతాధికారికి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా1,392 పోలీస్ స్టేషన్లు ఉండగా వాటిలో1,001 స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని న్యాయమూర్తి ఈ సందర్భంగా వివరించారు. అదే విధంగా రాష్ట్రంలోని 81 జైళ్లలో 1,226 కెమెరాలు ఏర్పాటు చేయగా.. వాటలో 785 మాత్రమే పని చేస్తున్నాయన్న హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనుసరించి.. కనీసం 12 నెలల పాటు సీసీ ఫుటేజ్ భద్రపరచాలని చెప్పింది. ఫుటేజ్ బ్యాకప్ కోసం జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేశారా? అనేదాని పై వివరాలను అఫిడవిట్లో చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర డీజీపీ, జైళ్లశాఖ డీజీకి హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా జ్ఞానేష్ కుమార్!
Also Read: శ్రీశైలంలో మల్లన్న బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
Also Read: వంశీ కోసం ఇరు వర్గాలు పిటిషన్లు.. కోర్టు కీలక ఆదేశాలు
Also Read: మీరు సొంత ఇల్లు కట్టుకొంటున్నారా.. ఈ పథకం ద్వారా డబ్బుల్లొస్తాయని మీకు తెలుసా?
Also Read: విజయవాడ కోర్టుకు సత్యవర్థన్.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం..
Also Read: టీ తాగిన తర్వాత చెత్తలో పడేసే టీ పొడి వల్ల ఇన్ని లాభాలున్నాయా.. ?
Also Read: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్: ఆర్టీసీ ఎండీ
For AndhraPradesh News And Telugu News