టీ తాగిన తర్వాత చెత్తలో పడేసే టీ పొడి వల్ల ఇన్ని లాభాలున్నాయా.. ?

టీ తాగిన తర్వాత.. వడ కట్టిన టీ పొడిని అంతా చెత్తలో పడేస్తారు. కానీ వాటి వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. 

ఇంట్లో చిన్న చిన్న మొక్కలు పెంచుతుంటే.. వాటికి వాడేసిన టీ పొడిని సహాజ ఎరువుగా ఉపయోగించ వచ్చు. మొక్కల ఎదుగుదలకు కావలసి పోషకాలను అవి అందిస్తాయి. 

కిచెన్‌లో రోజు వంట చేసే గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోతాయి. వాడేసిన టీ పొడితో వాటిని బ్రేష్ సహాయంతో శుభ్రం చేస్తే... అవి కొత్త వాటిలాగా ఉంటాయి.

అద్దాలను ఎంత శుభ్రం చేసినా.. వాటిపై త్వరగా దుమ్ము దూళి చేరిపోతాయి. అలాంటి వేళ.. అద్దాలను శుభ్రం చేయడం అంతా సులువైన  ప్రక్రియ కాదు.

మిగిలిపోయిన టీ పొడిని నీటిలో వేసి బాగా మరిగించి.. ఓ బాటిల్‌లో పోయాలి. అనంతరం ఆ నీటిని అద్దాలపై స్ప్రే చేస్తే.. సులువుగా శుభ్రమవుతాయి.

ఆ అద్దాలను కాటన్ క్లాత్‌తో శుభ్రంగా తుడవాలి. దీంతో అద్దాలు తళతళ మెరుస్తాయి. 

వాడేసిన టీ పొడిని ఇలా వాడితే.. జట్టు ఎల్లప్పుడు ఆరోగ్యంగా.. మెరుస్తు ఉంటుంది.

వాడేసిన టీ పొడిని నీటిలో బాగా మరగనిచ్చి.. చల్లారనివ్వాలి. 

తలస్నానం చేసిన తర్వాత.. ఈ నీటితో స్నానం చేయాలి. వీటిలో కెమికల్స్ ఉండవు. దీంతో జట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

రోజంతా బూట్లు ధరించడం వల్ల.. కొందరు పాదాలు ఓ విధమైన వాసన వస్తుంటాయి. ఎంతగా కాళ్లు కడిగినా.. ఆ వాసన మాత్రం పోదు. 

వాడేసిన టీ పొడిని నీటిలో బాగా మరిగించి.. గోరు వెచ్చగా మారన తర్వాత.. ఆ నీటిలో 10 నుంచి 15 నిమిషాలు పాదాలను నానబెట్టాలి. తద్వారా పాదల నుంచి వచ్చే దుర్వాసన పోతుంది.