అన్ని పండ్లు కి భిన్నంగా  ఉండే పండు అనస పండు

పట్టుకుంటే గుచ్చుకుంటుంది కోయడం కష్టమనీ, ముళ్లూ, ఆకులతో ఉండే విచిత్రమైన ఆకారం ఈ పండు

చాలా మంది ఈ పండును దూరం పెట్టి దానివైపు చూడటం మానేస్తారు

పైనాపిల్‌  అంటే పోషకాల గని. 

మన శరీరానికి కావాల్సిన విటమిన్లూ, ఖనిజాలూ అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

తక్కువ క్యాలరీలుండే ఈ పండులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది.

ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలు తింటే మనకు రోజు మొత్తంలో అవసరమైన విటమిన్‌ సి దొరికినట్టే

స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యల్ని ఇది చాలావరకూ తగ్గిస్తుంది.   

ఆ సమయంలో ఎదురయ్యే కాళ్లనొప్పులూ, కడుపు ఉబ్బరం వంటి లక్షణాల్ని అదుపులో ఉంచుతుంది.