వేసవిలో మనకు విరివిగా  దొరికే పండ్లలో పనసపండు ఒకటి

బంగారు ఛాయతో ఆకర్షించే.. పనస తొనలని ఇష్టపడనివారుండరు.

పచ్చికాయతో కూర, బిర్యానీ చేసుకుని ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. 

పనస పండు రుచికి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు

పనసపండులో డైటరీ ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ఐరన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పనస పండు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.. ఇవి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా.. శరీరాన్ని రక్షిస్తాయి.

వంద గ్రాముల పనస తొనలలో 94 కిలో కేలరీలు , మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పనసపండు తిన్న వంటనే తక్షణ శక్తిని పొందవచ్చు.

పనస పండులో పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

పనస పండు పొటాషియం మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది.

థైరాయిడ్‌ పేషంట్స్‌ పనసపండు తింటే.. మేలు జరుగుతుందని నిపుణలు చెబుతున్నారు.