Vallabhaneni Vamsi: వంశీ కోసం ఇరు వర్గాలు పిటిషన్లు.. కోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Feb 17 , 2025 | 06:52 PM
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కోసం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటి కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

విజయవాడ, ఫిబ్రవరి 17: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతోపాటు ఈ వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వంశీకి బెయిల్ మంజూరు.. అనారోగ్యం కారణంగా ఆయనకు బెడ్‌తోపాటు ఇంటి నుంచి ఆహారం తీసుకు వచ్చేలా సదుపాయాలు కల్పించాలంటూ విజయవాడలోని ఎస్సీ,ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయ స్థానంలో సోమవారం ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లను స్వీకరించిన కోర్టు.. రేపు అంటే మంగళవారం (ఫిబ్రవరి 18వ తేదీ)న ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేయాలని న్యాయమూర్తి సూచించారు. అనంతరం ఈ కేసును రేపటికి వాయిదా వేశారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో10 రోజుల పాటు తమ కస్టడీకి వల్లభనేని వంశీని ఇవ్వాలని సోమవారం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు.
మరోవైపు.. విజయవాడలోని రెండవ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ సమక్షంలో వీడియో షూటింగ్ ద్వారా రికార్డు చేస్తున్నారు. ఈ కేసులో సత్యవర్థన్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది. వల్లభనేని వంశీ కేసులో వాంగ్మూలం రికార్డు చేసేందుకు సత్యవర్థన్‌ను సోమవారం మధ్యాహ్నం విజయవాడ కోర్టుకు పటమట పోలీసులు తీసుకు వచ్చారు.
Also Read: మీరు సొంత ఇల్లు కట్టుకొంటున్నారా.. ఈ పథకం ద్వారా డబ్బుల్లొస్తాయని మీకు తెలుసా?
Also Read: విజయవాడ కోర్టుకు సత్యవర్థన్.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం..
ఇప్పటికే సత్యవర్థన్‌ను పటమట పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. ఆ క్రమంలో 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి అనంతరం ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ క్రమంలో నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read: టీ తాగిన తర్వాత చెత్తలో పడేసే టీ పొడి వల్ల ఇన్ని లాభాలున్నాయా.. ?
Also Read: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్: ఆర్టీసీ ఎండీ
అయితే ఈ కేసులను వెనక్కి తీసుకోవాలంటూ.. సత్యవర్థన్‌పై మాజీ ఎమ్మెల్యే వంశీతోపాటు అతడి అనుచరులు ఒత్తిడి చేశారు. ఆ క్రమంలో అతడి కుటుంబ సభ్యులను సైతం బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో సత్యవర్థన్ అన్ని విషయాలు పోలీసులు వివరించారు. దీంతో అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ క్రమంలో సహా న్యాయాధికారి అప్పారావు సమక్షంలో సత్యవర్థన్ వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేశారు.
For AndhraPradesh News And Telugu News