Share News

New CEC: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా జ్ఞానేష్ కుమార్!

ABN , Publish Date - Feb 17 , 2025 | 09:03 PM

New CEC: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మరికొన్ని గంటల్లో రిటైర్ కానున్నారు. అలాంటి వేళ.. కొత్త సీఈసీ ఎంపిక కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. కొత్త సీఈసీ ఎంపిక కోసం ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.

New CEC: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిగా జ్ఞానేష్ కుమార్!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పదవి కాలం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సీఈసీని ఎంపిక చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అలాంటి వేళ.. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవి కోసం కేంద్రం ఓ జాబితాను సిద్దం చేయగా.. అందులో 480 మంది పేర్లలో జ్ఞానేష్ కుమార్‌ పేరు ముందు ఉన్నట్లు తెలుస్తోంది. 1988 బ్యాచ్‌కి చెందిన కేరళ కేడర్‌ ఐఏఎస్ అధికారి అయిన ఈ జ్ఞానేష్ కుమార్‌ వయస్సు 61 సంవత్సరాలు. అదీకాక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ఆయన చాలా క్లోజ్ అనే ఓ చర్చ సైతం సాగుతోంది.

Also Read: శ్రీశైలంలో మల్లన్న బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఈ పదవికి జ్ఞానేష్ కుమార్‌ ఎంపిక చేస్తే.. ఈ ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆయన పర్యవేక్షణలో సాగుతాయి. అలాగే వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌తోపాటు అసోం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను సైతం ఈ జ్ఞానేష్ కుమార్‌ హయాంలోనే జరగనున్నాయి.

Also Read: వంశీ కోసం ఇరు వర్గాలు పిటిషన్లు.. కోర్టు కీలక ఆదేశాలు


అయితే జ్ఞానేష్ కుమార్‌.. గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో కీలక శాఖలను పర్యవేక్షించారు. అంటే 2019, ఆగస్ట్‌లో జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన ముసాయిదా బిల్లును రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కాశ్మీర్ డివిజన్‌ను ఆయన పర్యవేక్షించారు.

Also Read: మీరు సొంత ఇల్లు కట్టుకొంటున్నారా.. ఈ పథకం ద్వారా డబ్బుల్లొస్తాయని మీకు తెలుసా?

Also Read: విజయవాడ కోర్టుకు సత్యవర్థన్.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం..


అనంతరం హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా అయోధ్యలోని రామమందిరంకు సంబంధించిన పత్రాల రూపకల్పనలో సైతం జ్ఞానేష్ కుమార్‌ కీలకంగా వ్యవహరించారు. ఇక గతేడాది సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఆయన పదవీ విరమణ చేశారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ వాఖలో కార్యదర్శిగా సైతం పని చేశారు.

Also Read: టీ తాగిన తర్వాత చెత్తలో పడేసే టీ పొడి వల్ల ఇన్ని లాభాలున్నాయా.. ?

Also Read: ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్: ఆర్టీసీ ఎండీ


కాన్పూర్‌లోని ఐఐటీ నుంచి బి.టెక్ డిగ్రీని జ్ఞానేష్ కుమార్‌ అందుకున్నారు. అలాగే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా నుంచొ బిజినెస్ ఫైనాన్స్‌ను కూడా అభ్యసించారు. అదేవిధంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పర్యావరణ ఆర్థిక శాస్త్రాన్ని ఆయన అభ్యసించారు.

అయితే ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకొని మరికొద్ది రోజుల్లో స్వదేశానికి తిరిగి రానున్నారు. ఆ తర్వాత కొత్త సీఈసీని ఎంపిక జరిగే అవకాశముందని తెలుస్తోంది.

For National News And Telugu News

Updated Date - Feb 17 , 2025 | 09:11 PM