Heavy Rains: పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 08 , 2025 | 07:25 PM
దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం నాడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
అమరావతి, సెప్టెంబర్ 08: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో మంగళవారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది.
చెట్లు కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగులు వద్ద ఉండవద్దని ప్రజలకు సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో 80.5 మి.మీ., అనకాపల్లి జిల్లా కె.కోటపాడులో 68 మి.మీ., గంగవరంలో 61.5 మి.మీ., శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో 55 మి.మీ. చొప్పున అధిక వర్షపాతం నమోదు అయిందని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్‌పైకి దూసుకెళ్లిన యువత..
ట్రంప్ టారిఫ్‌లకు జెలెన్‌స్కీ మద్దతు..రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఒత్తిడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి