YSRCP.. వైఎస్సార్‌సీపీకి షాకులు మీద షాకులు..
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:54 AM
గతంలో అధికారంలో ఉండగా ఏకపక్షంగా స్థానిక సంస్థల్ని గెల్చుకున్న వైఎస్సార్‌సీపీకి ఇప్పుడు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు వరుస షాకులిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గుంటూరు నగర పాలక సంస్ధలోనూ ఇదే పరిస్ధితి ఎదురైంది. గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యానికి తాజాగా గండి పడింది.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Kutami Govt.) అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల్లో (Local Bodies) రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్థానిక సంస్థలు నడిపే పరిస్ధితి లేకపోవడంతో ఆయా చోట్ల వైఎస్సార్‌సీపీ (YSRCP)కి షాకులు (Shocked) తప్పడం లేదు. తాజాగా గుంటూరు (Guntur) మేయర్ (Mayor) పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను ఖరారు చేశారు. కార్పోరేటర్ల సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ మేరకు ఖరారు చేశారు. దీనికి కూటమి కార్పోరేటర్‌లు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గల్లా మాదవి, నసీర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం కార్పోరేషన్ టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా కోవెలమూడి ఉన్నారు. మార్చి 17తో మేయర్ పదవి కాలం నాలుగేళ్లు పూర్తి అవుతుంది. మార్చి 18 న ప్రస్తుత మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్దమవుతోంది.
గతంలో అధికారంలో ఉండగా ఏకపక్షంగా స్థానిక సంస్థల్ని గెల్చుకున్న వైఎస్సార్‌సీపీకి ఇప్పుడు కార్పోరేటర్లు, కౌన్సిలర్లు వరుస షాకులిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా గుంటూరు నగర పాలక సంస్ధలోనూ ఇదే పరిస్ధితి ఎదురైంది. గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యానికి తాజాగా గండి పడింది. మొత్తం 56 మంది కార్పొరేటర్లు ఉన్న కౌన్సిల్లో 34 మంది టీడీపీ నేతృత్వంలోని కూటమికి మద్దతు పలికారు. దీంతో మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలోని వైసీపీ కౌన్సిల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. తాజాగా జరిగిన స్టాండింగ్ కౌన్సిళ్ల ఎన్నికల్లో ఆరుగురు సభ్యుల్ని గెలిపించుకోవడంలో సక్సెస్ అయిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నాయి.
ఈ వార్త కూడా చదవండి..
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి
మార్చి 17వ తేదీతో గుంటూరు మేయర్ పదవి కాలం నాలుగేళ్లు పూర్తి అవుతుంది. ఆ మరుసటి రోజే (మార్చి 18న) ప్రస్తుత వైఎస్సార్‌సీపీ మేయర్ కావటి మనోహర్ నాయుడిపై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి పార్టీలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త మేయర్‌ను కూడా ఖరారు చేసేసింది. గుంటూరు నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర నానిని ఖరారు చేస్తూ తాజాగా కూటమి పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు నగరపాలక సంస్థ కార్పొరేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్, కార్పొరేషన్‌లో టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్రని మేయర్ అభ్యర్థిగా నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. యువకుడు మృతి..
దస్తగిరి ఫిర్యాదు కేసుపై విమర్శలకు తలెత్తిన విచారణ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News