Share News

Viveka Murder Case.. దస్తగిరి ఫిర్యాదు కేసుపై విమర్శలకు తలెత్తిన విచారణ

ABN , Publish Date - Feb 09 , 2025 | 09:13 AM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై వివేకా హత్యకేసులో 5వ నిందితుడు... దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డి విచారణ 30 నిమిషాల్లో ముగియడం చర్చనీయాంశమైంది.

Viveka Murder Case.. దస్తగిరి ఫిర్యాదు కేసుపై విమర్శలకు తలెత్తిన విచారణ
Viveka Murder Case

కడప: వైఎస్ వివేకా హత్య కేసు (Viveka Murder Case) అప్రూవర్ దస్తగిరి (Dastagiri ) ఫిర్యాదు కేసు (Case)పై విచారణ (Investigation ) విమర్శలకు దారితీసింది. దస్తగిరి ఫిర్యాదు మేరకు వివేకా హత్యకేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు (Devireddy Sivashankar Reddy son) డాక్టర్ చైతన్య రెడ్డిని (Dr. Chaitanya Reddy) పోలీస్ అధికారులు అరగంట పాటు విచారించి బయటికి పంపడంపై విమర్శలు వస్తున్నాయి. మేము చెప్పినట్లు విని అప్రూవర్‌గా లేకుండా డ్రాఫ్ అయితే రూ. 20 కోట్లు ఇస్తామని, వినకపోతే చంపుతామని జైల్లో చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశాడు.

ఈ వార్త కూడా చదవండి..

జగన్‌కు సీఎం చంద్రబాబు కౌంటర్


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌ మారిన డ్రైవర్‌ దస్తగిరిని జైలులో బెదిరించిన ఘటనపై వివేకా హత్యకేసు 5వ నిందితుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి కుమారుడు డాక్టర్‌ చైత న్యరెడ్డి విచారణ 30 నిమిషాల్లో ముగియడం చర్చనీయాంశమైంది. ‘వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారి మా రాజకీయ జీవితాన్ని నాశనం చేశావు. నీ వల్ల మా నాన్న శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి జైలుకెళ్లారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఇబ్బందిపడుతున్నారు. మర్యాదగా మా మాటలు వింటే బాగుపడతావు. మేం చెప్పినట్లు చేస్తే రూ.20 కోట్లు అడ్వాన్సు ఇస్తాం. మీ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటికే వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి సహకరిస్తున్నారు. నీవు అలాగే సహకరించు. లేదంటే నిన్ను నరికేస్తాం’ అంటూ కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న తనను బెదిరించారని దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యవహారంపై రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారి రాహుల్‌ శ్రీరామ కడప సెంట్రల్‌ జైలులో విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం దస్తగిరిని మూడు గంటల పాటు విచారించిన ఆయన శనివారం డాక్టర్‌ చైతన్యరెడ్డిని విచారణకు పిలిచారు.


అయితే, ఉదయం 11.30 గంటలకు వచ్చిన చైతన్యరెడ్డి కేవలం 30 నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. 20 కోట్ల డీల్‌ను విచారణాధికారులు 30 నిమిషాల్లోనే ముగించారంటూ చర్చ నడుస్తోంది. మరోసారి విచారణకు రమ్మన్నారా? లేక విచారణ పూర్తి చేసి పంపించారా? అన్నది తెలియాల్సి ఉంది. మధ్యాహ్న భోజనం అనంతరం జైలర్‌ ప్రకాశ్‌ను రాహుల్‌ శ్రీరామ విచారించారు. దాదాపు మూడేళ్ల పాటు కడప జైలు సూపరింటెండెంట్‌గా ప్రకాశ్‌ పనిచేశారు. గత ఏడాది ఆగస్టు వరకు ఆయన ఇక్కడే కొనసాగారు. దస్తగిరి ఫిర్యాదు మేరకు ఈ కేసులో ప్రకాశ్‌ను ఏ2గా పేర్కొన్నారు. విచారణాధికారి రాహుల్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సంప్రదించగా ‘విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఎన్నిరోజులు జరుగుతుందో తెలియదు. పూర్తయిన తర్వాత మీడియాకు చెబుతాం’ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రవారిని దర్శించుకున్న శ్రద్ధా శ్రీనాథ్

డీటీసీకి 14 రోజుల రిమాండ్‌

భార్యను చంపింది గురుమూర్తి ఒక్కడే కాదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 09 , 2025 | 09:14 AM