Share News

AP Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Nov 30 , 2025 | 02:05 PM

వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో సిట్ అధికారులకు తవ్వేకొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

AP Liquor Scam: లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం

అమరావతి, నవంబర్ 30: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కాంలో సిట్ అధికారులకు తవ్వేకొద్ది అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో ఆయన భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో సిట్ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులను జప్తు చేసేందుకు వారు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఆస్తులు జప్తు చేసేందుకు సిట్ అధికారులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మద్యం కేసులో వచ్చిన నగదుతో తెలంగాణలో ఆయన భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం.


తెలంగాణలోని ఒక జిల్లాలో భారీ నగదు చెల్లించి.. మూడు ప్లాట్లు ఆయన కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. ఈ ఆస్తుల కొనుగోలుకు చెల్లించిన సొమ్ము మద్యం ముడుపులేనని సిట్ అధికారులు పక్కాగా ఆధారాలు సేకరించారు. అలాగే మహేశ్వరం, రామచంద్రపురంలోని సైతం ఓఎస్డీ కృష్ణమోహన్‌‌రెడ్డికి మరిన్ని ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వాటి వివరాలను సైతం సిట్ అధికారులు డాక్యుమెంట్లు సేకరించి జప్తునకు రంగం సిద్ధం చేశారు. అలాగే ఈ నగదుపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సైతం సిట్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.


ముందస్తుగా ఒక పక్కా ప్రణాళికతో కృష్ణమోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించినట్లు సమాచారం. ఇక ఇప్పటికే మద్యం స్కాంలో ఏ1 గా ఉన్న రాజ్ కసిరెడ్డికి సంబంధించి భారీగా స్థిరాస్తులు తెలంగాణలో వెలుగులోకి వచ్చాయి. వాటిని సైతం ఇప్పటికే అధికారులు జప్తు చేశారు. అయితే ఈ జప్తు చేసిన ఆస్తుల్లో ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయా? అనే కోణంలో సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మద్యం స్కాంలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కి చేరింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఔటర్ చుట్టూరా.. మెట్రో నిర్మిస్తే ఎంతో ప్రయోజనం

భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?

Read Latest AP News and National News

Updated Date - Nov 30 , 2025 | 02:28 PM