Share News

Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం..

ABN , Publish Date - Jun 29 , 2025 | 08:35 AM

Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు.

Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం..
Visakha Express

Palnadu Dist: విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (Visakha Express)లో దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు (Robbery Attempt). దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకుని.. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు (Railway police).. దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు (Open fire) జరిపారు. దీంతో భయపడిన దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు. పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం, తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన (Tummala Cheruvu incident) చోటు చేసుకుంది.


కాగా పిడుగురాళ్ల సమీపంలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్‌లు వరుసగా రైళ్ళలో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున చోరికి పాల్పడటంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు రైలులోని పలు కోచ్‌లను లక్ష్యంగా చేసుకొని చోరీకి యత్నించారు. విశాఖ ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా, ఈ దుండగులు రైలులోకి చొరబడి ప్రయాణికుల సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.


రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి, దుండగులను అడ్డుకోవడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. లేకపోతే భారీ చోరీ జరిగేదని ప్రయాణీకులు వాపోయారు. అయితే రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. దుండగులు చీకటిలో రైల్లో నుంచి దూకి తప్పించుకున్నారు. దుండగులు రైలులోని ఐదు కోచ్‌లను టార్గెట్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా వారం రోజుల వ్యవధిలో రైళ్లలో రెండు సార్లు దొంగతనాలు జరిగాయి.


ఇవి కూడా చదవండి:

కడపలో ఓ యువకుడు యువతిని బెదిరించి...

ఒకే వేదికపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే..

బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 29 , 2025 | 08:35 AM