ఒకే వేదికపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే..

ABN, Publish Date - Jun 29 , 2025 | 06:57 AM

Thackeray Brothers: మహారాష్ట్ర సర్కార్ మరాఠి, ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు తరగతులకు హిందీ తప్పనిసరిగా మూడవ భాషగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో అక్కడ..

Maharastra: విడిపోయిన అన్నదమ్ములు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray).. రాజ్ ఠాక్రే (Raj Thackeray)లు ఒకే వేదికపై కలవనున్నారు. హిందీ (Hindi)ని బలవంతంగా ప్రజలపై రుద్ధాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి నిరసన (Protest) చేపట్టనున్నట్లు ఇరువురు నేతలు ఇప్పటికే వెల్లడించారు. జులై 5న చేపట్టనున్న ఆందోళన ఠాక్రే సోదరులను ఒకే వేదికపైకి తీసుకురానుంది.


మహారాష్ట్ర సర్కార్ మరాఠి, ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదు తరగతులకు హిందీ తప్పనిసరిగా మూడవ భాషగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. జాతీయ విద్య విధానం కింద త్రిభాష సూత్రం అమల్లో భాగంగా పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ విపక్షాలు జులై 5న నిరసనకు పిలుపిచ్చాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


ఇవి కూడా చదవండి:

బిహార్‌లో మొబైల్‌ ఈ-ఓటింగ్‌

నటి పాకీజాకు సహాయం చేయాలంటే

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated at - Jun 29 , 2025 | 06:57 AM