Lavu Srikrishnadevarayalu: తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్ నాయుడు: ఎంపీ
ABN , Publish Date - Dec 08 , 2025 | 09:16 PM
ఇండిగో సంస్థతో ప్రభుత్వ పరంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా విమానాలు రద్దయ్యాయన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 08: ఇండిగో సమస్యపై పలు రకాల కథనాలు ప్రచురిస్తున్నారని.. దీనిపై వివరాలు తెలుసుకుని విశ్లేషిస్తే బాగుంటుందని పార్లమెంట్‌లో టీడీపీపీ నేత, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అభిప్రాయపడ్డారు. సోమవారం న్యూఢిల్లీలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విలేకర్లతో మాట్లాడుతూ.. ఏవియేషన్ ఇండస్ట్రీ టెక్నికల్ ఇండస్ట్రీ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 36 ఏళ్ల యువకుడు కె. రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిష్టర్ అయ్యారన్నారు. అతి తక్కువ సమయంలో కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు మంచి పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు.
డిసెంబర్ 3వ తేదీ నుంచి ఇండిగో సమస్య ప్రారంభం అయ్యిందన్నారు. ఏవియేషన్ రంగంలో డీజీసిఏ మొత్తం 22 సంస్కరణలు తీసుకొస్తుందని చెప్పారు. ఇండిగో సంస్థతో ప్రభుత్వ పరంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారని తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా విమానాలు రద్దయ్యాయన్నారు. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ పరంగా అధికారులను ఆయన సమన్వయం చేశారని వివరించారు. ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా వార్ రూమ్ ఏర్పాటు చేశారని.. వాటిని ఆయన పరిశీలించారని చెప్పారు.
ఇక 90 శాతానికి పైగా బ్యాగేజ్ రిటర్న్ చేశారని.. అలాగే రూ. 600 కోట్లకుపైగా నగదు రిఫండ్ చేశారని వివరించారు. గత 15 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదన్నారు. తొలిసారిగా 500,1000,1500 కిలోమీటర్ల దూరానికి ధర విషయంలో క్యాప్ విధించారని పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలతోపాటు కొందరు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీనియర్ మంత్రిలాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఏవియేషన్ పరంగా ఎయిర్ పోర్టులకు వెళ్తే ఉడాన్ స్కీంలో భాగంగా సామాన్యులకు అందుబాటులో ఫుడ్ ఏర్పాటు చేశారన్నారు.
మూడు కొత్త ఎయిర్ లైన్స్‌కి ఆమోదం తెలిపారని వివరించారు. దీన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. లేని దాన్ని ఉన్న విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థకు కోర్టు కూడా సమయం ఇచ్చిందని గుర్తు చేశారు. డాలర్ ధర, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కూడా టిక్కెట్‌పై భారం పడుతుందని వివరించారు. ఏవియేషన్ సెక్టార్‌లో కాంపిటీషన్ పెంచడానికి కొత్తవారికి అనుమతి ఇస్తున్నారని చెప్పారు. పార్టీ పరంగా తాము మాట్లాడుతున్నామన్నారు.
రామ్మోహన్ నాయుడు ప్రయాణికుల సమస్యను తీర్చడానికి పని చేశారని చెప్పారు. ఇండిగో సమస్య పై కమిటీ వేశారని.. దానిని వారు పరిశీలిస్తున్నారని తెలిపారు. ఏవియేషన్ రంగంలో ఈ ఏడాదిన్నర కాలంలో రామ్మోహన్ నాయుడు పలు సంస్కరణలు తీసుకొచ్చారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ముసుగులో నేరాల చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం: సీఎం
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
Read Latest AP News And Telugu News