Share News

Palnadu Melioidosis Case: పల్నాడులో మెలియాయిడోసిస్‌ కలకలం..

ABN , Publish Date - Oct 12 , 2025 | 10:24 AM

మెలియాయిడోసిస్ అంటు వ్యాధి కాదని పల్నాడు జిల్లా వైద్యాధికారి రవి స్పష్టం చేశారు. గ్రామస్థులు భయపడవద్దన్న సూచించారు.

Palnadu Melioidosis Case: పల్నాడులో మెలియాయిడోసిస్‌ కలకలం..
Palnadu Melioidosis Case

పల్నాడు: జిల్లాలో మెలియాయిడోసిస్‌ వ్యాధి కలకలం రేపింది. వెల్దుర్తి మండలం దావుపల్లితండాలో జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. మెలియాయిడోసిస్ పాజిటివ్‌గా బయటపడింది. దీంతో రోగిని అధికారులు మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ మేరకు గ్రామంలో జిల్లా వైద్యాధికారి రవి పర్యటించారు.


ఈ సందర్భంగా వైద్యాధికారి రవి మాట్లాడుతూ.. మెలియాయిడోసిస్ అంటు వ్యాధి కాదని స్పష్టం చేశారు. గ్రామస్థులు భయపడవద్దన్న సూచించారు. ఇప్పటికే గుంటూరు జిల్లా తురకపాలెంను మెలియాయిడోసిస్ వ్యాధి వణికించిన విషయం తెలిసిందే. గుంటూరు జీజీహెచ్‌లోని చికిత్స పొందుతున్న తురకపాలేనికి చెందిన ఆరుగురిలో ఒకరికి మెలియాయిడోసిస్‌ పాజిటివ్‌గా తేలింది. 46 ఏళ్ల ఆ వ్యక్తి మోకాలిలోని ద్రవాన్ని సేకరించి పరీక్షకు పంపించగా ఈ వ్యాధి నిర్ధారణ అయింది.


ఇవి కూడా చదవండి..

Indigo Flight: విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Massive Explosion: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు

Updated Date - Oct 12 , 2025 | 11:07 AM