Nizam From Anantapur: సార్.. రక్షించండంటూ నిజాం వేడుకోలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 03:39 PM
విదేశాలకు వెళ్లితే.. అధిక మొత్తంలో నగదు సంపాదించవచ్చు. దీంతో కుటుంబంలో సమస్యలు తీరిపోతాయని చాలా మంది భావిస్తారు. ఆ క్రమంలో దేశం కానీ దేశం వెళ్లి తీవ్ర కష్టాల పాలవుతారు.
విదేశాలకు వెళ్లితే.. అధిక మొత్తంలో నగదు సంపాదించవచ్చు. దీంతో కుటుంబంలో సమస్యలు తీరిపోతాయని చాలా మంది భావిస్తారు. ఆ క్రమంలో దేశం కానీ దేశం వెళ్లి తీవ్ర కష్టాల పాలవుతారు. అంతేకాకుండా.. విదేశాలకు వెళ్లేందుకు భారీగా అప్పులు సైతం చేస్తారు. అలా విదేశాలకు వెళ్లి అక్కడ పని చేస్తూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. తాజాగా అలాంటి పరిస్థితినే సౌదీలో అనంతపురానికి చెందిన నిజాం అనే వ్యక్తి అనుభవిస్తున్నాడు. ఆ క్రమంలో తన యజమాని చిత్రహింసలు పెడుతున్నాడని.. తనను ఎలాగైనా కాపాడాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లను అతడు వేడుకున్నారు.
ఈ మేరకు ఒక వీడియో సందేశం ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి కిడ్నీ సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. అతడికి చికిత్స కోసం ర. 12 లక్షలు అవసరమవుతాయని వైద్యులు చెప్పారన్నారు. దీంతో సౌదీకి రెండు నెలల క్రితం ఉపాధి కోసం వెళ్లినట్లు తెలిపారు. అక్కడ తన యజమాని తనతో పని చేయించుకొని నగదు ఇవ్వడం లేదని వాపోయారు. అంతేకాకుండా.. అతడు తనను నిత్యం చిత్రహింసలు పెడుతున్నారంటూ వీడియోలో నిజాం కన్నీటి పర్యంతమయ్యారు. తనను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేలా చూడాలంటూ ప్రభుత్వాన్ని అతడు వేడుకున్నాడు. అందుకు సంబంధించిన నిజాం వీడియో మీడియా, సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం
For AP News And Telugu News