Nara Devaansh: తాత వరల్డ్ లీడర్.. మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్..
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:10 PM
నారా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇదో ప్రత్యేకమైన ఘనతని వ్యాఖ్యానించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మనవడు, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ అరుదైన ఘనత సాధించారు. తాతకు తగ్గ మనవడుగా.. వరల్డ్ స్థాయి అవార్డును అందుకున్నారు. ఫాస్టెస్ట్ చెక్‌మెట్ సాల్వర్‌గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను నారా దేవాన్ష్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో ప్రముఖుల చేతుల మీదుగా దేవాన్ష్ అవార్డు స్వీకరించారు. అవార్డ్ ప్రదానోత్సవానికి మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును దేవాన్ష్ అందుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఇదో ప్రత్యేకమైన ఘనతని వ్యాఖ్యానించారు. ఒక తండ్రిగా పుత్రోత్సాహం పొందుతున్నానని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అటు దేవాన్ష్ అవార్డ్ సాధించడంపై టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్, ఆయన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.
గతేడాది డిసెంబర్ నెలలో దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన విషయం తెలిసిందే. చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా కేవలం తొమ్మిదేళ్ల వయస్సులోనే ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్ రికార్డును సొంతం చేసుకున్నారు. వ్యూహాత్మకమైన ఆటతీరుతో 11 నిమిషాల 59 సెకన్లలో చెక్‌మేట్ పజిల్స్‌ను దేవాన్ష్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ నేపథ్యంలో తాజాగా.. లండన్‌లో నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ ప్రదానోత్సవంలో నిర్వాహకుల చేతుల మీదుగా దేవాన్ష్ అవార్డు అందుకున్నారు.
ఇవి కూడా చదవండి..
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
243 సీట్లలో పోటీ చేస్తాం..బీహార్‌లో గేమ్ ఛేంజర్ ప్లాన్..