Share News

AP Govt: ఉచిత బస్సు పథకం‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Jul 26 , 2025 | 09:38 PM

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంత్రి లోకేష్‌తో ఈ విషయంపై చర్చించానని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు.

AP Govt: ఉచిత బస్సు పథకం‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Free Bus Travel For Women in AndhraPradesh

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సులో ప్రయాణించవచ్చని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) తెలిపారు. అన్నవరంలో ఇవాళ(శనివారం) సుపరిపాలనలో తొలి అడుగు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్‌తో ఈ విషయంపై చర్చించానని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనపై ఇటీవల ఆర్టీసీ అధికారుల సమక్షంలో మంత్రి నారా లోకేష్ ప్రస్తావించారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 09:58 PM