Share News

AP Govt Clarity On Turakapalem: తురకపాలెంలోని పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 14 , 2025 | 06:18 PM

జిల్లాలో తురకపాలెం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఈ గ్రామంలో యురేనియం సమస్య లేదని స్పష్టం చేసింది.

AP Govt Clarity On Turakapalem: తురకపాలెంలోని పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన
AP Govt Clarity On Turakapalem:

గుంటూరు, సెప్టెంబర్ 14: జిల్లాలో తురకపాలెం గ్రామంలోని ఆరోగ్య పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ ఆదివారం కీలక ప్రకటన చేసింది. ఈ గ్రామంలో యురేనియం సమస్య లేదని స్పష్టం చేసింది. నీటి శాంపిల్స్ ఫలితాల్లో యురేనియం పరిమిత స్థాయిలోనే ఉందని పేర్కొంది. అయితే ఇబ్బందికర స్థాయిలో యురేనియం అవశేషాలు లేవని తెలిపింది. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని ప్రజలకు ఈ సందర్భంగా సూచించింది. మరోవైపు తురకపాలెంలో కాలుష్యం అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు వైద్యారోగ్యశాఖ వివరించింది.


అయితే గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంతో ఇటీవల వరుసగా మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆ క్రమంలో వైద్య బృందాలను గ్రామానికి పంపి వైద్య పరీక్షలు నిర్వహించింది. అలాగే గ్రామంలోని మట్టిని, నీటిని సైతం పరీక్షించేందుకు చెన్నై, ఎయిమ్స్, జీజీహెచ్‌లోని ల్యాబ్‌కు తరలించారు.

ఈ గ్రామంలోని నీటిని చెన్నైలోని ల్యాబ్‌ పరీక్షించింది. ఈ నీటిలో యురేనియం ఉందంటూ కీలక ప్రకటన చేసింది. ఇదే విషయాన్ని మీడియా సైతం వెల్లడించింది. అయితే ఈ నీటిలో యురేనియం నిల్వలు తగిన స్థాయిలోనే ఉన్నాయని.. ఎటువంటి ఆందోళనలు చెందాల్సి అవసరం లేదంటూ ప్రజలకు వైద్యారోగ్య శాఖ సూచించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

హనీ ట్రాప్‌‌లో చిక్కుకున్న యోగా గురువు.. పోలీసుల ఎదుట లబోదిబో..

నేటికి దేశవ్యాప్తంగా బాలికలపై లైంగిక వేధింపులు..

For More AP News And Telugu news

Updated Date - Sep 14 , 2025 | 06:34 PM