Share News

AP Free Bus: స్త్రీ శక్తి పథకానికి అద్భుతమైన రెస్పాన్స్..

ABN , Publish Date - Aug 16 , 2025 | 10:05 PM

ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి గతంలో అనుమతించని ఆర్టీసీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘాట్ రూట్‌లలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

AP Free Bus:  స్త్రీ శక్తి పథకానికి అద్భుతమైన రెస్పాన్స్..
Free Bus

అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉచిత బస్సు పథకం అమలు తీరును సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. గడచిన 30 గంటల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులు ఉచితంగా 12 లక్షల మందికిపైగా ప్రయాణించారని పేర్కొన్నారు. పథకం తొలిరోజు ఉచిత బస్సు ప్రయాణాలతో మహిళలకు రూ.5 కోట్ల మేర ఆదా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఘాట్ రూట్లలోనూ.. ఉచిత ప్రయాణానికి అనుమతించాలని చంద్రబాబు ఆదేశించినట్లు వివరించారు.

free-bus-1.jpg


ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి గతంలో అనుమతించని ఆర్టీసీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఘాట్ రూట్‌లలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18 తేదీ సోమవారం నుంచి పనిదినాలు కావడంతో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రయాణించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఎల్లుండి నుంచి బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మరింతగా రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఆధార్ కార్డుతో సహా స్థానికతను నిర్దేశించే ఇతర ధృవీకరణ కార్డులను ఆర్టీసీ అనుమతించనుంది. ఆధార్ ఒరిజినల్‌తో పాటు జిరాక్స్ కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్‌లో ఆధార్ సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని వివరించారు. స్త్రీ శక్తి పథకంపై ఆర్టీసీ సిబ్బంది మహిళా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

free-bus-3.jpg


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడ బస్టాండ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం స్త్రీ శక్తిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఉండవల్లి గుహల నుంచి విజయవాడ బస్టాండ్‌ వరకూ మహిళలతో కలిసి ప్రయాణించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు రాష్ట్ర మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లభించిందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్లర్లను గతంలో తానే నియమించానని, త్వరలో మహిళా డ్రైవర్లు కూడా రాబోతున్నారని సీఎం వెల్లడించారు.

Sri-Sakthi-02.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

రిజిస్టర్డ్ పోస్ట్ మాయం.. పోస్టల్ శాఖ కీలక నిర్ణయం

Updated Date - Aug 16 , 2025 | 10:06 PM