CM Chandrababu Naidu, Minister Lokesh: ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:09 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌లు వేర్వేరుగా విదేశీ పర్యటనలు ముగించిన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి వారు ఉండవల్లిలోని తమ నివాసానికి మరికాసేపట్లో చేరుకోనున్నారు.
అమరావతి, అక్టోబర్ 26: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబునాయుడితోపాటు మంత్రి నారా లోకేశ్ మరికాసేపట్లో ఉండవల్లిలోని తమ నివాసానికి చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు వారిరువురు చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లిలోని నివాసానికి వారు చేరుకుంటారు. సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. అలాగే నారా లోకేశ్ సైతం ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.
మూడు రోజు పర్యటన కోసం సీఎం చంద్రబాబు నాయుడు దుబాయ్, సౌదీ అరేబియా, యూఏఈలో పర్యటించిన సంగతి తెలిసిందే. అలాగే రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ విదేశీ పర్యటనల్లో భాగంగా వారిరువురు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను ఆ యా దేశాల్లోని ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమై వివరించారు.
అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆ యా దేశాల్లోని పారిశ్రామిక వేత్తలు, సీఈఓలు, ఉన్నతాధికారులను ఆహ్వానించారు. విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. అందుకోసం ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.
మరోవైపు ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు దావోస్, సింగపూర్‌లో పర్యటించారు. అలాగే మంత్రి నారాయణ సైతం దక్షిణ కోరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ యా దేశాలకు చెందిన ఉన్నతాధికారులతోపాటు వివిధ కంపెనీల సీఈఓలతో వారు సమావేశమయ్యారు. విశాఖలో జరగనున్న ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆ యా దేశాల ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
శవాల మీద రాజకీయం చేస్తున్న వైసీపీ: ఎంపీ శబరి
మొంథా తుపాన్.. జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు: హోం మంత్రి
For More AP News And Telugu News