Chandrababu Naidu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 10 , 2025 | 05:39 PM
ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 23 జిల్లాల్లో ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు.
అమరావతి, డిసెంబర్ 10: అధిక వడ్డీలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని.. అప్పులు రీ షెడ్యూల్ అయితే వడ్డీ భారత తగ్గుందని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏడాదికి రూ. 7 వేల కోట్లు ఆదా అవుతుందని ఆయన వివరించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో వివిధ విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ)తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్ర నిధులను ఖర్చు పెట్టండి.. యూసీలు ఇవ్వండని వారిని కోరారు.
ఫైళ్లను పెండింగులో పెట్టొద్దని మంత్రులు, ఉన్నతాధికారులకు సూచించారు. పని తీరు మెరుగు పరచుకోవాలంటూ వారికి సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖలపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు, కార్యదర్శులు, పలు విభాగాల అధిపతుల పాల్గొన్నారు.
మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 23 జిల్లాల్లో ఇప్పటి వరకూ 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే 32 శాతం మేర ధాన్యం కొనుగోళ్లు పెరిగాయని ఈ సందర్భంగా తెలిపారు. మొత్తం 2,606 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ జరుగుతున్నదని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల వద్ద 7.89 కోట్ల గోనె సంచులను రైతులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలోనే రూ.4,085 కోట్ల మేర చెల్లింపులు జరిపినట్లు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఈ ఏడాది మొత్తంగా 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్న ఈ సమీక్షా సమావేశంలో వివరించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తోపాటు వ్యవసాయ, పౌరసరఫరాలు, ఆర్ధిక శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సుప్రీంకోర్టు ఆదేశాలు.. పిన్నెల్లి సోదరులు కీలక నిర్ణయం
తొలి దశ పల్లె పోరుకు సర్వం సిద్ధం.. ఓటరుకు కీలక సూచన: ఎస్ఈసీ
Read Latest AP News and National News