Share News

AP Registration Charges: రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భారీగా క్యూ కట్టిన జనం.. ఎందుకంటే..

ABN , Publish Date - Jan 31 , 2025 | 07:13 PM

AP Registration Charges: ఏపీలో రిజిస్ట్రేషన్‌ చార్జీలు రేపటి నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ, పల్లె ప్రాంతాల్లో పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సర్కార్ స్పష్టం చేసింది. భూమి ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లను సవరించాలనే నిర్ణయంలో భాగంగా చాలా చోట్ల 10 నుంచి 20 శాతం మేర, మరికొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 25 శాతం మేర పెంచేలా ప్రభుత్వం సవరించింది.

AP Registration Charges: రిజిస్ట్రేషన్  కార్యాలయాలకు  భారీగా క్యూ కట్టిన జనం.. ఎందుకంటే..
AP Registration Charges

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ చార్జీల్లో సవరణలు రేపటి(శనివారం) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. మార్కెట్ విలువలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువలను సవరిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ల చార్జీలు పెరుగుతాయనే కారణంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద ప్రజలు నిన్న, ఇవాళ భారీగా క్యూ కట్టారు. గురువారం ఒక్కరోజే రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.107.78 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో రూ.13.82 కోట్లు వచ్చింది. విశాఖపట్నంలో రూ.13.61, గుంటూరులో రూ.13.08 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చింది. నిన్న(గురువారం) ఒక్కరోజే ఏపీ వ్యాప్తంగా 14 వేల 250 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే 1184 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రెండో స్థానంలో ఎన్టీఆర్, మూడో స్థానంలో పల్నాడు జిల్లాలు ఉన్నాయి. ఇవాళ కూడా భారీ రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు అంచనా వేస్తున్నాయి.


ఉపందుకున్న రియల్‌ భూమ్‌

కాగా..ఏపీలో రిజిస్ట్రేషన్‌ చార్జీలు రేపటి నుంచి పెరుగనున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పట్టణ, పల్లె ప్రాంతాల్లో పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని సర్కార్ స్పష్టం చేసింది. భూమి ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లను సవరించాలనే నిర్ణయంలో భాగంగా చాలా చోట్ల 10 నుంచి 20 శాతం మేర, మరికొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 25 శాతం మేర పెంచేలా ప్రభుత్వం సవరించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్‌ భూమ్‌ కాస్త ఉపందుకుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ విలువ పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకోందిం. దీంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనేది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది.


భారీ ఎత్తున లావాదేవీలు

రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరుగబోతున్నాయని నెల రోజులుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచింది. కొనుగోలుదారుల లావాదేవీలు భారీ ఎత్తున సాగాయి. రిజిస్ట్రేషన్‌ ధరలు పెరగక ముందే గత నెల రోజుల్లో ప్రజలు భారీగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వాస్తవానికి నెల రోజుల క్రితమే రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ విషయంపై కసరత్తు చేయాలని రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ అధికారులను కూటమి ప్రభుత్వం ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు సార్లు రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరిగాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.


వైసీపీ నేతలు కబ్జాలు

రిజిస్ట్రేషన్ల రేట్లు పెరగడంతో ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి విముఖత వ్యక్తం చేశారు. దీంతో రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విలువ క్రమంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం లేఅవుట్‌లు వేశారే తప్ప క్రయ విక్రయాలు వేగంగా జరగలేదు. ఇదిలా ఉంటే విలువైన స్థలాలను కూడా వైసీపీ నేతలు కబ్జాలకు ఆక్రమించుకున్నారు. అయితే భూముల కొనుగోళ్లకు, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. ఒక్క ఏలూరు నగరంలోనే 130కు పైగా లావాదేవీలు మూడేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి.


తగ్గిన ఆదాయం

కేవలం అడ్వాన్సులు చెల్లించి గతంలో ఉన్న అగ్రిమెంట్లకు పలుమార్లు మార్చుకుంటూ వచ్చారు. అప్పట్లో లేఅవుట్‌ వేయాలంటే కింది నుంచి పైస్థాయి వరకు వైసీపీ నేతలకు కప్పం చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. దీనికితోడు లేఅవుట్‌లలో కొన్ని ప్లాట్లను ఆయా నేతలకు బహుమానంగా ఇచ్చేవారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ ఆదాయం తగ్గింది. ప్రత్యేకించి వ్యవసాయ భూములు తప్ప హౌసింగ్‌ లేఅవుట్‌లలో లావాదేవీలన్నీ ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.


ఈ వార్తలు కూడా చదవండి

Sanjay: సంజయ్ సస్పెన్షన్‌పై సర్కార్ కీలక నిర్ణయం

AP News: ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. అసలు విషయం ఇదే..

Supreme Court: సుప్రీంకు డాక్టర్ ప్రభావతి...హైకోర్టు ఉత్తుర్వులపై స్టే

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 07:40 PM