Share News

Inter Exam Schedule Release: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ABN , Publish Date - Oct 03 , 2025 | 06:02 PM

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇవి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరున ప్రారంభమై.. మార్చి తొలి వారంతో ముగియనున్నాయి. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది.

Inter Exam Schedule Release: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Inter Exam Schedule Release

అమరావతి, అక్టోబర్ 03: ప్రథమ, ద్వితీయ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఇవాళ (శుక్రవారం) విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమై మార్చి 24వ తేదీ వరకూ జరుగనున్నాయి. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23వ తేదీ వరకూ జరుగుతాయి. జనవరి 21వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష ఉంటుంది.


జనవరి 23వ తేదీన పర్యావరణ పరిరక్షణ పరీక్ష నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకూ ప్రాక్టికల్ పరీక్షలు చేపట్టనుంది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకూ ఒకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 13వ తేదీన సమగ్ర శిక్షా ఒకేషనల్ ట్రేడ్ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.


ఏపీ ఇంటర్ 2026 పరీక్షల షెడ్యూల్ వివరాలు..

  • ఫిబ్రవరి 23: మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1

  • ఫిబ్రవరి 24: రెండో సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2

  • ఫిబ్రవరి 25: మొదటి సంవత్సరం ఇంగ్లీషు పేపర్ 1

  • ఫిబ్రవరి 26: రెండో సంవత్సరం ఇంగ్లీషు పేపర్ 2

  • ఫిబ్రవరి 27: మొదటి సంవత్సరం హిస్టరీ పేపర్ 1

  • ఫిబ్రవరి 28: రెండో సంవత్సరం హిస్టరీ/ బోటనీ పేపర్ 2


  • మార్చి 2: మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 1

  • మార్చి 3: రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2ఏ/ సివిక్స్ 2

  • మార్చి 5: మొదటి సంవత్సరం జూవాలజీ/ మ్యాథ్స్ 1బి

  • మార్చి 6: రెండో సంవత్సరం జూవాలజీ 2/ ఎకనామిక్స్ 2

  • మార్చి 7: మొదటి సంవత్సరం ఎకనామిక్స్ 1

  • మార్చి 9: రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 2బి


  • మార్చి 10: మొదటి సంవత్సరం ఫిజిక్స్ 1

  • మార్చి 11: రెండో సంవత్సరం ఫిజిక్స్/ కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 2

  • మార్చి 12: మొదటి సంవత్సరం కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ 1

  • మార్చి 13: రెండో సంవత్సరం ఫిజిక్స్ 2

  • మార్చి 14: మొదటి సంవత్సరం సివిక్స్ 1


  • మార్చి 16: రెండో సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 2

  • మార్చి 17: మొదటి సంవత్సరం కెమిస్ట్రీ 1

  • మార్చి 18: రెండో సంవత్సరం కెమిస్ట్రీ 2

  • మార్చి 20: మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 1

  • మార్చి 21: రెండో సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ 2

  • మార్చి 24: మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్/ జియోగ్రఫీ 1

ఇవి కూడా చదవండి...

వరద పరిస్థితులపై హోంమంత్రి అనిత ఆరా

ఉత్తరాంధ్ర వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 03 , 2025 | 06:32 PM