AP High Court: సీఎం చంద్రబాబు కేసులో తీర్పు ప్రతులు ఇచ్చేలా ఆదేశించండి: హైకోర్టును ఆశ్రయించిన సువర్ణరాజు
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:41 AM
చంద్రబాబు నాయుడిపై నమోదయిన కేసులు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ కేసు ప్రతులు ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టును మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు సువర్ణ రాజు ఆశ్రయించారు.
అమరావతి, డిసెంబర్ 31: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసుల రికార్డులకు సంబంధించి తీర్పు ప్రతులను ఇవ్వాలంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టును ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సువర్ణ రాజు ఇటీవల ఆశ్రయించారు. వీటిని ఇచ్చేందుకు సదరు కోర్టు నిరాకరించింది. ఏసీబీ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో సువర్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలంటూ ఏపీ సీఐడీని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను వారం రోజులకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
గత వైసీపీ ప్రభుత్వం.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్ కేసులు నమోదు చేసింది. ఫైబర్ నెట్ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు ఇటవల కొట్టివేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సైతం సీఐడీ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ నోటీసు జారీ చేసింది. దాంతో ఈ కేసుల మూసివేతకు సంబంధించిన కోర్టు రికార్డులు, తీర్పు ప్రతులను తనకు అందించాలంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మండవ సువర్ణరాజు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పెన్షన్ లబ్ధిదారులకు తీపి కబురు.. నేటి నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
న్యూ ఇయర్ వేళ.. మందుబాబులకు ఫ్రీ
For More AP News And Telugu News