Share News

AP Government: బాబు సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీకి కొత్త సీఎస్

ABN , Publish Date - Nov 29 , 2025 | 05:35 PM

ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయిప్రసాద్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 2026 మార్చి ఒకటో తేదీ నుంచి సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

AP Government: బాబు సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీకి కొత్త సీఎస్
AP Government

అమరావతి, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయిప్రసాద్‌‌ను (New CS Sai Prasad) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) నియమించింది. 2026 మార్చి ఒకటో తేదీ నుంచి సాయిప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఎస్ కె. విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలలు (మార్చి 28, 2026) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు జీవో నంబర్ 2230ను విడుదల చేసింది ప్రభుత్వం.


మరోవైపు.. పదిమంది డిప్యూటీ కలెక్టర్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జీవో ఆర్టీ నెంబర్ 2228 జారీ చేశారు సీఎస్ విజయానంద్.


ఈ వార్తలు కూడా చదవండి..

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. జాగ్రత్త సుమీ!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 29 , 2025 | 05:53 PM