Share News

CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు కారణమిదే..

ABN , Publish Date - Mar 18 , 2025 | 07:49 PM

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ బీజీ బీజీగా ఉండనుంది.

CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు కారణమిదే..
CM Chandrababu Naidu

అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(మంగళవారం) ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా సమీపంలోని ఎయిర్ ఫోర్స్ ఆడిటోరియానికి వెళ్లనున్నారు. శివరాజ్ సింగ్ చౌహన్ కుమారులు కార్తికేయ, కునాల్‌ల వివాహా రిసెప్షన్‌కు చంద్రబాబు హాజరుకానున్నారు. అనంతరం అధికార నివాసానికి వన్ జన్‌పద్‌కు చంద్రబాబు వెళ్తారు.


ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు తదితర అంశాలపై ఎంపీలతో చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.రేపు(బుధవారం) కూడా ఢిల్లీలోనే చంద్రబాబు ఉండనున్నారు. రేపు గేట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. వివిధ రంగాల్లో ఏపీకి సహకారంపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందాలను సీఎం చంద్రబాబు కుదర్చుకోనున్నారు.


బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌ నెలాఖరులో అమరావతి పనుల పున:ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్నారు. ఈ భేటీ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు ఇతర అంశాలపై ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కలవనున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉండనున్నారు.


తానా సమావేశాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

తానా సమావేశాలకు ఏపీ సీఎం చంద్రబాబును తానా బృందం ఆహ్వానించింది. ఈ రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్‌లో కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో తానా సమావేశాల చైర్మన్ నాదెండ్ల గంగాధర్, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులు ఉన్నారు. జూలై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తానా సమావేశాలు జరుగనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

Posani : ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ విచారణ

WhatsApp Governance: మా లక్ష్యమిదే.. వాట్సప్‌ గవర్నెన్సుపై లోకేష్

Botsa request to Pawan: పవన్‌ను సమయం కోరిన బొత్స.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 18 , 2025 | 08:38 PM