Share News

Dress Code In AP Assembly: దసరా నవరాత్రులు.. డ్రెస్ కోడ్‌తో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Sep 25 , 2025 | 01:07 PM

కూటమిలోని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఈ రోజు పసుపు రంగు చీరలతో అసెంబ్లీకి హాజరయ్యారు. నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో అమ్మవారు భక్తులకు రోజుకొక అవతారంలో దర్శనమిస్తారు.

Dress Code In AP Assembly: దసరా నవరాత్రులు.. డ్రెస్ కోడ్‌తో అసెంబ్లీకి ఎమ్మెల్యేలు

అమరావతి, సెప్టెంబర్ 25: దసరా నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో నవరాత్రుల్లో రోజూ అమ్మవారికి ఏ రంగు దుస్తులతో అలంకరిస్తున్నారో.. అదే రంగు వస్త్రాలతో అసెంబ్లీకి వెళ్లాలని వారంతా నిర్ణయించారు. అందులో భాగంగా గురువారం అంటే నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మ వారు శ్రీకాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.


దీంతో మహిళా ఎమ్మె్ల్యేలంతా ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించిన అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే రాష్ట్రాన్ని చల్లగా చూడాలని ఆ దుర్గమ్మను తామంతా వేడుకున్నామని వారు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలపై ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో తామంతా ఈ డ్రెస్‌ కోడ్‌‌ను పాటిస్తున్నామని వారు వివరించారు. ఇక దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ప్రారంభమైనాయి. సెప్టెంబర్ 23వ తేదీన ఈ నవరాత్రలు ప్రారంభమైనాయి. ఇవి అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి.


మరో వైపు అసెంబ్లీలో ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తకాలను పార్టీ నేత టీడీ జనార్దన్ అందజేశారు. అనంతరం సభ ముఖ ద్వారం వద్ద వారంతా ఎన్టీఆర్ పుస్తకాలు పట్టుకుని గ్రూప్ ఫోటోలు దిగారు. ఈ సందర్బంగా జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్ అంటూ వారంతా బిగ్గరగా నినాదాలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

 సిలిండర్ పేలితే.. భారీగా పరిహారం.. ఈ విషయం తెలుసా?

నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి

Read Latest  AP News And Telugu News

Updated Date - Sep 25 , 2025 | 01:14 PM