Pawan Kalyan OG: ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంపు..
ABN , Publish Date - Sep 17 , 2025 | 07:53 PM
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ మెమో జారీ చేశారు. ఓజీ సినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, సినీ హీరో పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ మెమో జారీ చేశారు. ఓజీ సినిమా ఈనెల 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
అయితే ఓజీ సినిమా బెనిఫిట్ షోను 25వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు రూ.1000 టికెట్ రేట్‌తో ప్రదర్శించుకునేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రూ.125 గాను, అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.150 గాను నిర్ధారించారు. ఈనెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ టికెట్ రేట్లు అమల్లో ఉంటాయని వెల్లడించింది. కాగా, ఓజీ సినిమాపై పవన్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మూవీ విడుదల కోసం వారంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్లు పెంచడంపై పవన్ డైహార్డ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
విశాఖలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ
For More Latest News