Narayana: ఆయనను గెలిపిద్దాం.. బాబుకు బహుమతి ఇద్దాం.. మంత్రి నారాయణ దిశానిర్దేశం
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:14 AM
Narayana: ఉభయగోదావరి జిల్లాలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేశామని.. మరోసారి ఆ ఫలితాలు రిపీట్ అవ్వాలని తెలిపారు మంత్రి నారాయణ. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్డీఏ నేతలతో మంత్రి సమావేశమై దిశానిర్దేశం చేశారు.

కాకినాడ, ఫిబ్రవరి 7: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్డీఏ నేతలతో కాకినాడ జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ (Minister Narayana) శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్లు, ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రాజశేఖర్‌ను గెలిపించి సీఎం చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) బహుమతి ఇద్దామని సూచించారు. ఎమ్మెల్యేలు, నాయకులు తమ తమ తమ నియోజకవర్గాలలో పూర్తిస్థాయిలో ఓటింగ్ పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉభయగోదావరి జిల్లాలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేశామని.. మరోసారి ఆ ఫలితాలు రిపీట్ అవ్వాలని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం తొమ్మిది నెలల కాలంలో మంచి ప్రభుత్వంగా నిరూపించుకుందని చెప్పుకొచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం అనేక కంపెనీలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను మరింతగా పట్టభద్రులలోకి తీసుకువెళ్లాలని నాయకులకు మంత్రి నారాయణ సూచించారు.
Vijayasaireddy: అందుకే వదిలేశా.. జగన్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రులు కృషి చేస్తున్నారు. పలు సమావేశాలు నిర్వహిస్తూ నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గెలుపు కోసం ఎన్డీఏ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రాడ్యూయేట్‌లను కలిసి రాజశేఖర్‌ను గెలిపించాల్సిందిగా కోరుతున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకోవడానికి తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి ప్రభుత్వం.. ఈ స్థానాన్ని గెలిపించే బాధ్యతలను జిల్లా నేతలకు, శ్రేణులకు అప్పగించింది.
మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, నారాయణ పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 3 లక్షలకు పైగా పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా షూరే అయ్యింది. ఈ నెల 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 8, 9 తేదీల్లో సెలవు దినాలు ఉన్నాయి. 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. 13న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈనెల 27 పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 3న ఓట్లను లెక్కించనున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది.
ఇవి కూడా చదవండి..
హైడ్రా దూకుడు.. ఎయిర్ పోర్టు దగ్గర..
Read Latest AP News And Telugu News