MLC Subramanyam: కిడ్నాప్ వివాదంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్సీ
ABN , Publish Date - Feb 04 , 2025 | 10:58 AM
MLC Subramanyam: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక 'సందర్భంగా హై డ్రామా నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేశారంటూ కొంత మంది వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ కిడ్నాప్ వివాదంపై సుబ్రహ్మణ్యం స్పందించారు.
తిరుపతి: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు మంగళవారం ఎస్వీసెట్ హాల్లో జరగాల్సి ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కనపడటం లేదని, ఆయనను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఫోన్‌లో అందుబాటులో లేరని ఆయన ఆచూకీ తెలియడం లేదని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కిడ్నాప్ వివాదంపై వైసీపీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం స్పందించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. అనారోగ్యంతో తాను ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. కిడ్నాప్ చేశారని వదంతులు సృష్టించొద్దని ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకుని వైసీపీ
తిరుపతి ఉప మేయర్ ఎన్నిక జరిగే ఎస్వీ యూనివర్సిటీ సెనెక్ట్ హాల్ వద్దకు వైసీపీ కార్పొరేటర్లు చేరుకున్నారు. వైసీపీ తరఫున తిరుపతి ఎంపీతో కలిపి 21 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. మ్యాజిక్ ఫిగర్ 26 కావాల్సి ఉండగా వైసీపీ తరఫున 22 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు వైసీపీ చేరుకోలేదు. కూటమి తరఫున ఎంతమంది హాజరవుతారనే ఉత్కంఠ నెలకొంది.
కాగా.. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగాల్సి ఉంది.ఈ ఎన్నిక కోసం ఎస్వీయూ సెనేట్ హాల్లో ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. కానీ, ఈ ఎన్నిక కోసం కోరం పూర్తిగా లేకపోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ప్రకటించారు. 47 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. 22 మంది మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. 50 శాతం కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా అనివార్యమైంది.
ఈ వార్తలు కూడా చదవండి
Arasavalli.. శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
Rathasaptami .. తిరుమల, అరసవల్లిలో రథసప్తమి వేడుకలు..
Nandamuri Balakrishna : ఎన్టీఆర్‌కు భారతరత్న... అందరి కోరిక: బాలకృష్ణ
Read Latest AP News and Telugu News