TTD Board Meeting: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
ABN , Publish Date - Sep 16 , 2025 | 10:31 AM
టీటీడీ సమావేశంలో పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకోనుంది. శ్రీవారి నిధులతో పలు ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
తిరుపతి: తిరుమలలో ఇవాళ(మంగళవారం) టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, గరుడ వాహన సేవపై చర్చించనున్నట్లు సమాచారం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లే ప్రధాన అజెండగా సమావేశం కొనసాగనుంది. ఈ మేరకు సమావేశానికి అంతా సిద్ధం చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో టీటీడీ పలు కీలక విషయాలపై నిర్ణయం తీసుకోనుంది. శ్రీవారి నిధులతో పలు ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలకు నిధులు కేటాయింపుపై పాలకమండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తుల కోసం చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సమావేశంలో చర్చలు జరగనున్నాయి. అలాగే.. పలు కొనుగోళ్లు, ఇంజనీరింగ్ పనులకు పాలకమండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం