Alipiri: పనిచేయని ఫాస్ట్ ట్యాగ్.. పట్టించుకోని టీటీడీ.. భక్తుల ఆగ్రహం
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:11 PM
Fast Tag: తిరుమల అలిపిరి టోల్ గేట్ వద్ద వెంకన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా టోల్‌గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ సిస్టం పనిచేయడం లేదు. దీంతో నగదు రూపంలో టోల్ ఫీజు చెల్లింపులకు అక్కడి సిబ్బంది నిరాకరిస్తున్నారు.

తిరుమల, ఫిబ్రవరి 15: తిరుమల అలిపిరి టోల్‌గేట్‌లో ఫాస్ట్ ట్యాగ్ (Fast Tag) సిస్టం పనిచేయడం లేదు. దీంతో టోల్ ఫీజుకు నగదు తీసుకోవడానికి నిరాకరిస్తున్న సిబ్బంది.. ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలని చెబుతున్నారు. సిబ్బంది నిర్వాకంతో వెంకన్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజులుగా ఇదే తంతు నడుస్తున్నా టీటీడీ పట్టించుకోవడంతో లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి దర్శనార్ధం తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా అలిపిరి భద్రతా వలయం వద్ద వారి వాహనాలను తనిఖీలు చేసుకున్న అనంతరం టోల్‌గేట్‌లో ఫీజు కట్టిన తరువాత తిరమలకు వెళ్లాల్సి ఉంటుంది.
అందులో భాగంగా గతంలో నేరుగా డబ్బులు వసూలు చేసిన టీటీడీ.. కొంత కాలంగా ఫాస్ట్ ట్యాగ్ విధానం రూపంలో వాహనదారుల వద్ద టోల్ ఫీజును వసూలు చేస్తోంది. అయితే గత వారం రోజులుగా ఫాస్ట్ ట్యాగ్ సిస్టంలో తలెత్తిన లోపాల కారణంగా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసింది టీటీడీ. ఫోన్ పే ద్వారా భక్తుల నుంచి టోల్ ఫీజును వసూలు చేస్తోంది టీటీడీ. అయితే చాలా మంది భక్తులు వారి వద్ద ఫోన్ పే లేకపోవడంతో టోల్ ఫీజు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అక్కడున్న టోల్‌గేట్ సిబ్బందికి తమ వద్ద ఫోన్‌పే లేదని చెప్పటినప్పటికీ పట్టించుకోకపోవడమే కాకుండా.. భక్తులతో టోల్‌గేట్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా ఫోన్ పే ద్వారా డబ్బులు కడితేనే వాహనాలను అనుమతిస్తామని, లేదంటే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Buddha Venkanna: జగన్ చాప్టర్ క్లోజ్.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
తమకు ఎదురవుతున్న ఇబ్బందులను భక్తులు అక్కడి భద్రతా సిబ్బందికి చెబుతున్నప్పటికీ వారు స్పందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వేరే భక్తుల వద్ద ఉన్న ఫోన్ పే ద్వారా తమ టోల్ ఫీజును కట్టి తిరుమలకు బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి ఏర్పడినప్పటికీ టీటీడీ అధికారులు ఎవరూ స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రతీ వాహనానికి ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతీఒక్క భక్తుడి వాహనానికి ఫాస్ట్ ట్యాగ్ ఉండటంతో టోల్ గేట్ వద్దకు వస్తున్న సమయంలో ఫాస్ట్ ట్యాగ్ ద్వారా టోల్‌ఫీజు వసూలు చేస్తే భక్తులకు సులభతరంగా ఉంటుంది. కానీ వారం రోజులుగా ఫాస్ట్ ట్యాగ్‌కు బదులుగా ఫోన్ పే విధానంతో టోల్ ఫీజు వసూలు చేస్తుండటంతో భక్తులు ఇబ్బందులకు గురవడమే కాకుండా టోల్‌గేట్ వద్ద చాలా సేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇవి కూడా చదవండి...
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. అసలు కారణమిదే..
రైతన్నకు అండగా.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా
Read Latest AP News And Telugu News