Share News

CM Chandrababu: ఆ విషయం నాకే అర్ధం కావట్లేదు.. గత ప్రభుత్వంపై సీఎం ఫైర్

ABN , Publish Date - Mar 01 , 2025 | 04:47 PM

CM Chandrababu: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద గంగాధరనెల్లూరులో సీఎం పెన్షన్లను పంపిణీ చేశారు.

CM Chandrababu: ఆ విషయం నాకే అర్ధం కావట్లేదు.. గత ప్రభుత్వంపై సీఎం ఫైర్
CM Chandrababu Naidu

చిత్తూరు, మార్చి 1: జిల్లాలోని గంగాధర నెల్లూరులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu).. లబ్దిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. లబ్దిదారులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళితవాడలో ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ... గత ఐదేళ్లపాటు జనం ఎన్నో బాధలు పడ్డారని.. ఇప్పుడు 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్లు రూ.6 వేలకు పెంచామన్నారు. 8 లక్షల మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. కిడ్నీ, తలసేమియా రోగులకు రూ.10వేలు ఇస్తున్నామని.. తీవ్ర వ్యాధులతో కదలలేనివారికి రూ.15 వేలు ఇస్తున్నామని వెల్లడించారు.


అదే నా ఆకాంక్ష..

chandrababu-anakapalli.jpg

పెన్షన్ల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సంబంధాలు, విలువలకు మన దేశం ప్రపంచానికే ఆదర్శమన్నారు. అనాథ పిల్లల బాగోగులు చూసుకునేందుకు కుటుంబసభ్యులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవన్నారు. క్షేత్రస్థాయిలోనే తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. పెన్షన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలని అధికారులకు చెప్పామన్నారు. ‘‘పేదల జీవితాల్లో వెలుగులు రావాలి.. అదే నా ఆకాంక్ష’’ అని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని తెలిపారు. గత ఐదేళ్లు చేసిన విధ్వంసం తనకే అర్థం కావడం లేదన్నారు.

అందాన్ని పెంచడంలో ఈ మొక్కకు మించింది లేదు


మరో రెండు నెలల్లో...

ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికెళ్లి పెన్షన్లు అందిస్తున్నామన్నారు. చెప్పిన ప్రతి హామీ నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామన్నారు. ప్రతి సేవా సెల్‌ఫోన్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందులు అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని అన్నారు. సంపద ఎలా సృష్టించాలన్న దానిపై నిత్యం ఆలోచన చేస్తున్నామన్నారు. తాము వచ్చిన 9 నెలల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పుకొచ్చారు. కేంద్రంతో కలిసి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. నాగరిక ప్రపంచంలో పారిశుద్ధ్యం చాలా అవసరమని.. మరో 2 నెలల్లో రోడ్లపై గుంతలు పూడ్చటం పూర్తవుతుందని సీఎం తెలిపారు.


మాయమాటలు చెప్పను..

రద్దీ ప్రాంతాల్లో నాలుగు వరుసల్లో కొత్త రోడ్లు వేస్తున్నామన్నారు. మీ భూ పత్రాలపై రాజముద్ర ఉండాలని.. నేతల ఫొటోలు కాదన్నారు. తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికీ రూ.15 వేలు ఇస్తామని వెల్లడించారు. ఎంత మంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద సాయం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని ప్రకటించారు. త్వరలోనే రైతులకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. అలాగే మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. ఆర్థిక సాయం చేసే వీలుంటేనే హామీ ఇస్తామని.. లేకుంటే మాయమాటలు చెప్పనని తెలిపారు. రెండ వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Anitha: వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 01 , 2025 | 04:47 PM