Tirupati Murder: ఆటో డ్రైవర్ దారుణం.. కత్తితో దాడి, ఒకరు మృతి..
ABN , Publish Date - Aug 31 , 2025 | 08:43 AM
పోలీసుల కథనం ప్రకారం.. ఆటో డ్రైవర్ అశోక్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హేమంత్‌కు మధ్య పాత కక్షలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
తిరుపతి: కొర్లగుంట పట్టణ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. అశోక్ అనే వ్యక్తి కత్తితో ముగ్గురు వ్యక్తులపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను స్థానికులు ఆసపత్రికి తరలించారు. పట్టణ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ ప్రాంతంలో నిన్న(శనివారం) అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ మేరక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు అశోక్‌ను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఈ ఘటనలో కొర్లగుంటకు చెందిన చందు(25) మృతి చెందగా.. అదే ప్రాంతానికి చెందిన సుధాకర్, హేమంత్‌కు గాయాలయ్యాయి. అయితే.. గాయపడ్డ ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చందు మృతి చెందినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ అశోక్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హేమంత్‌కు మధ్య పాత కక్షలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. హేమంత్ అతడి స్నేహితులు సుధాకర్, చందులతో కలిసి ఆటో డ్రైవర్ అశోక్‌పై కత్తితో దాడికి దిగారు. అయితే అశోక్ వారి చేతిలోని కత్తిని లాక్కుని ముగ్గురిపై దాడి చేశారు. ఈ దాడిలో చందు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..
జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..