Share News

Indrakeeladri Celebrations: అన్నపూర్ణదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం..

ABN , Publish Date - Sep 24 , 2025 | 09:30 AM

ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవిగా ఆమెను భక్తులు కొనియాడుతున్నారు.

Indrakeeladri Celebrations: అన్నపూర్ణదేవిగా ఇంద్రకీలాద్రి అమ్మవారి  దర్శనం..
Annapurna Devi Alankaram

ఎన్టీఆర్: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు మూడో రోజుకి చేరుకున్నాయి. ఇవాళ(బుధవారం) అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించేందుకు ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు.

అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిటపట్టి మానవాళి ఆకలి బాధలను తీర్చే తల్లి అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది.


ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని భక్తులు కొనియాడుతున్నారు. తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని ప్రజలు విశ్వసిస్తారు. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. ఇవాళ(బుధవారం) అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, బూరెలు సమర్పిస్తారు. ఈ మేరకు ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

కమిషనర్‌ వార్నింగ్.. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు

Updated Date - Sep 24 , 2025 | 09:37 AM