Share News

Andhra Totapuri Mango: మామిడి రైతులకు బిగ్ రిలీఫ్

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:22 PM

ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025–26 సంవత్సరానికి MIS కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలుకు అవకాశం లభించినట్లైంది. మామిడి రైతులకు క్వింటాల్‌కు రూ.1,490.73లు చెల్లించనున్నారు.

Andhra Totapuri Mango: మామిడి రైతులకు బిగ్ రిలీఫ్

ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025–26 సంవత్సరానికి MIS కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలుకు అవకాశం లభించినట్లైంది. మామిడి రైతులకు క్వింటాల్‌కు రూ.1,490.73లు చెల్లించనున్నారు. 50:50 నిష్పత్తితో కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఈ మద్దతు ధర చెల్లించనున్నాయి. ఈ మేరకు.. ప్రధాని నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ చర్య ధరల పతనాల నుండి రైతులను కాపాడటానికి అవకాశం లభించిందన్నారు. ఈ చర్య న్యాయమైన రాబడిని నిర్ధారిచండంతో పాటూ గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు.


మామిడి రైతులను ఆదుకోవడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు చొరవతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తోతాపురి మామిడి రైతులకు మద్దతుగా ట్రేడర్లు ముందుకొచ్చారు. అదేవిధంగా పలు ప్రాసెసింగ్ యూనిట్లు కూడా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.


ఇవీ చదవండి..

సైట్‌ క్లియరెన్స్‌ కోసం ఏపీ దరఖాస్తు

ఏపీ, తెలంగాణలో తలసరి ఆదాయాల పెరుగుదల

For Telugu and Latest News

Updated Date - Jul 22 , 2025 | 01:15 PM