Share News

Kuppam Greenfield Airport: సైట్‌ క్లియరెన్స్‌ కోసం ఏపీ దరఖాస్తు

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:52 AM

చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కోసం సైట్‌ క్లియరెన్స్‌ అనుమతుల కోసం రాష్ట్రప్రభుత్వం గత జూన్‌లో దరఖాస్తు చేసిందని కేంద్ర పౌర విమాన సహాయ మంత్రి...

Kuppam Greenfield Airport: సైట్‌ క్లియరెన్స్‌ కోసం ఏపీ దరఖాస్తు

  • కుప్పం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంపై రాజ్యసభలో కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కోసం సైట్‌ క్లియరెన్స్‌ అనుమతుల కోసం రాష్ట్రప్రభుత్వం గత జూన్‌లో దరఖాస్తు చేసిందని కేంద్ర పౌర విమాన సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వారానికి 1194 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం, రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ.. 2008లో కేంద్రం తీసుకొచ్చిన విధానాన్ని అనుసరించి 2016లో ఓర్వకల్లు(కర్నూలు), దగదర్తి (నెల్లూరు), భోగాపురం(విజయనగరం) విమానాశ్రయాలకు ‘ఇన్‌-ప్రిన్సిపల్‌’ ఆమోదం ఇచ్చిందని తెలిపారు. దగదర్తికి సంబంధించి, 2018లో ఏపీ ఎయిర్‌పోర్టు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, నెల్లూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య ఒప్పందం జరిగిందని, అయితే ఆ ఒప్పందాన్ని గత ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని కేంద్రమంత్రి మురళీధర్‌ తెలిపారు.

Updated Date - Jul 22 , 2025 | 06:54 AM