Share News

MLA Nazir Ahmed : గుంటూరు తూర్పు ఎమ్మెల్యేపై దాడి

ABN , Publish Date - Jan 24 , 2025 | 03:43 AM

గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌పై దాడి జరిగింది.

MLA Nazir Ahmed : గుంటూరు తూర్పు ఎమ్మెల్యేపై దాడి

  • తమకు చెప్పకుండా వచ్చారంటూ నజీర్‌ అహ్మద్‌పై స్థానిక టీడీపీ నేతల ధ్వజం

  • నేతాజీకి నివాళి కార్యక్రమంలో రభస

  • పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

గుంటూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి): గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌పై దాడి జరిగింది. నియోజకవర్గ పరిధిలోని ఒకటవ డివిజన్‌లో సుభాష్‌ చంద్రబోస్‌ సేవా మిత్ర మండలి అధ్యక్షురాలు మొవ్వా శైలజ ఆధ్వర్యంలో గురువారం నేతాజీ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌ను ఆహ్వానించారు. ఈ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడిగా సయ్యద్‌ ఇంతియాజ్‌ ఉన్నారు. ఆయన సోదరుడు సయ్యద్‌ ఫైరోజ్‌ గత కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఈ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం ఆయన నగర టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. జయంతి వేడుకలు వారింటికి సమీపంలోని ఆర్టీసీ కాలనీలో జరిగాయి. తమకు తెలియకుండా ఎమ్మెల్యే ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరు కావడంపై ఇంతియాజ్‌, ఫైరోజ్‌ సోదరులతో పాటు ఆయన సమీప బంధువు రియాజ్‌... వేదికపై ఉండగానే నజీర్‌ అహ్మద్‌ను నిలదీశారు. ఎమ్మెల్యే వారిని హెచ్చరిస్తూ చెయ్యెత్తారు. దీంతో ఫైరోజ్‌, ఇంతియాజ్‌, రియాజ్‌లు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని చేయి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచారు. కార్యక్రమ నిర్వాహకురాలు శైలజ ఫిర్యాదు మేరకు పాత గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం

Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 24 , 2025 | 03:43 AM