Share News

Janasena: కూటమిపై అసత్య ఆరోపణలు చేశారో.. ఇక ఊరుకునేది లేదు..

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:48 PM

వైసీపీ నాయకులు కూటమి నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారన్నారు.

Janasena: కూటమిపై అసత్య ఆరోపణలు చేశారో.. ఇక ఊరుకునేది లేదు..

- జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం

ధర్మవరం(అనంతపుపురం): కూటమి నాయకులపై అసత్య ఆరోపణలు చేయాలని చూస్తే సహించేదిలేదని వైసీపీ నాయకులు, జగన్‌ సొంత పత్రికపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి(Chilakam Madhusudhan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం పట్ట ణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...జగన్‌ సొంత మీడియా గ్రామాల్లో కక్షలు, కార్పాణ్యాలు రేపుతూ చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.


pandu5.jpg

కూటమి ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందని, ఎలాగైనా ప్రజల్లో ప్రభుత్వాన్ని అబాసు పాలుచేయాలని పత్రికను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు కుటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సోషల్‌ మీడియాలో వైసీపీకి చెందిన సైకోలను పెట్టుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. మండలంలోని రేగాటిపల్లి .పంచా యతీ ముచ్చురామి గ్రామంలో మామిడిచెట్లు ఎవరో కొట్టివేస్తే అనవస రంగా జనసేన కార్యకర్తలపై నిందలు వేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా అవాస్తవాలు రాయడం మానుకోవాలని హెచ్చరించారు.


pandu5.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

మరో వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 02 , 2025 | 12:48 PM