Share News

CM Chandrababu: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 07 , 2025 | 08:37 AM

బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగాన్ని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

CM Chandrababu: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
CM Nara Chandrababu Naidu

అమరావతి: బక్రీద్ (Bakrid) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగాన్ని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవభక్తులు..

‘హజ్రత్ ఇబ్రహీం త్యాగానికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ముబారక్. త్యాగబుద్ధిని, నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవకృపకు పాత్రులు అవుతారు అనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తోంది. నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవభక్తులుగా చెప్పొచ్చు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని బక్రీద్ సందర్భంగా కోరుకుంటున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుందాం: మంత్రి నారా లోకేష్

Minister Nara Lokesh

బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, అనురాగం, దాన గుణాలను పెంపొందించే పండుగ ఈద్‌ అల్‌ అదా (బక్రీద్) అని చెప్పారు. నిస్వార్ధమైన ఆత్మీయ అనుబంధాలను వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుందామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ.. భక్తుల విశ్వాసానికి ప్రతీక

డీమ్డ్‌ యూనివర్సిటీగా ఆదిశంకర

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 10:09 AM