Share News

ABN Andhra Jyothi 16th Anniversary: ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, సిబ్బందికి మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు

ABN , Publish Date - Oct 15 , 2025 | 09:22 PM

ప్రముఖ వార్తా ఛానల్, డైలీ న్యూస్ పేపర్ ABN ఆంధ్రజ్యోతి తన 16వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. నిజాయితీ..

ABN Andhra Jyothi 16th Anniversary:  ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, సిబ్బందికి  మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు
ABN Andhra Jyothi 16th Anniversary

అమరావతి, అక్టోబర్ 15: ప్రముఖ వార్తా ఛానల్ ABN ఆంధ్రజ్యోతి తన 16వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. నిజాయితీ, నిష్పాక్షికత, ప్రజా సమస్యలపై అంకితభావంతో వార్తలు అందిస్తున్న ABN ఛానల్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కు అభినందనలు తెలియజేశారు.


ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్న ABN ఆంధ్రజ్యోతి మీడియా రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభంగా మీడియాలో విశ్వసనీయతను నిలబెట్టిన ABN పాత్ర ప్రశంసనీయమన్నారు. వ్యవసాయం, విద్య, ఉపాధి, ప్రజా ప్రయోజన అంశాలపై చర్చలు నిర్వహిస్తూ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తున్న ABN ఛానల్ కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.


జర్నలిజం రంగంలో కొత్త ప్రమాణాలను సృష్టించిన ABN యాజమాన్యం, సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు అచ్చెన్న. వార్తా ప్రపంచంలో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న ABN మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లండి.. బిహార్ బీజేపీ కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం

బీజేపీ రెండో జాబితా.. అలీనగర్ నుంచి సింగర్ మైథిలీ ఠాకూర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 15 , 2025 | 09:22 PM