Rains: రానున్న 2 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏపీకి విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక!
ABN , Publish Date - Jul 19 , 2025 | 07:53 PM
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులూ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Rain Alert, అమరావతి: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న 2 రోజులూ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తరాంధ్ర, ఏపీ కోస్తా తీరప్రాంతాలు, రాయసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
జులై 20న ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు, గుంటూరు, బాపట్ల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. లోతట్టు, తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. చెట్లు, భవనాలు, శిథిలావస్థలో ఉన్న గోడల వద్ద నిలబడవద్దని సూచించారు.
ఇవి కూడా చదవండి:
లోకేష్-ఆనంద్ మహీంద్రా మధ్య ఆసక్తికర సంభాషణ
ఇంద్రకీలాద్రిలో జులై 25 నుంచి శ్రావణ మాసోత్సవాలు..