Tension: కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడంతో తాడిపత్రిలో టెన్షన్..
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:02 AM
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి.. అటు పెద్దారెడ్డి నివాసానికి వారివారి అనుచరులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Anantapuram Dist: తాడిపత్రి (Tadipatri)లో మరోసారి ఉద్రిక్త(Tension) పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Ex MLA Kethireddy Pedda Reddy) రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఇంటికి.. అటు పెద్దారెడ్డి నివాసానికి వారివారి అనుచరులు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు (Police) అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు సమాచారం లేకుండా తాడిపత్రికి పెద్దారెడ్డి రావడంపై అభ్యంతరం తెలిపారు పోలీసులు. అనంతరం తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని అనంతపురం తరలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రిలోని భగత్‌సింగ్ నగర్‌లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు. అయితే శాంతిభద్రతల సమస్యల దృష్ట్యా కేతిరెడ్డిని తాడిపత్రికి రావద్దని పోలీసులు గతంలో పలుమార్లు సూచించారు. ఇదే విషయాన్ని తాజాగా ప్రశ్నించగా.. తాను హైకోర్టు ఆదేశాలతో తన నివాసానికి వచ్చానని కేతిరెడ్డి చెప్పారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్దఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండానికి వీల్లేదని.. గతంలో వైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని జేసీ ఆరోపించారు. అలాగే తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని మండిపడ్డారు. తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడే అవకాశముందని జేసీ అన్నారు.
దీంతో పెద్దారెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు ఇక్కడ ఉండేందుకు వీల్లేదంటూ ఆయన్ను అనంతపురానికి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయి. పెద్దారెడ్డి పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రి రావడంపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శాంతి భద్రతల నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లవద్దని పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. ఇక్కడ గొడవలు జరిగితే దీనికి ఎవరు బాధ్యులంటూ పోలీసులు పెద్దారెడ్డిని ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పెద్దారెడ్డికి హెచ్చరించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ
గోల్కొండ కోటలో బోనాల సందడి.. భారీగా భక్తులు
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం..
For More AP News and Telugu News