Share News

JC Vs Ketireddy: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్పీకి వైసీపీ నేతల ఫిర్యాదు

ABN , Publish Date - Jun 30 , 2025 | 01:57 PM

JC Vs Ketireddy: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేదన్నారు.

JC Vs Ketireddy: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్పీకి వైసీపీ నేతల ఫిర్యాదు
JC Vs Ketireddy

అనంతపురం, జూన్ 30: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై (JC Prabhakar Reddy) జిల్లా ఎస్పీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈరోజు (సోమవారం) వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జేసీపై ఎస్పీ జగదీష్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతి ఇచ్చినా తాడిపత్రిలోకి రానీయడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని.. తగిన భద్రత కల్పించాలని రెండు మాసాల కిందటే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను రపా.. రపా.. నరుకుతానంటూ జేసీ బెదిరిస్తున్నారని... తనకు మద్దతుగా నిలిచిన వారిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.


హింసకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ముండమోపి రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం ఉండేదన్నారు. ఆఫ్ట్రాల్ మున్సిపల్ ఛైర్మన్ జేసీ చెబితే పోలీసులు నడుచుకోవటం హాస్యాస్పదమన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు.


కేతిరెడ్డిని తాడిపత్రికి అనుమతించాల్సిందే: వెంకటరామిరెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఆ కార్యక్రమం నిర్వహించాల్సి ఉందని.. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి వెంటనే అనుమతించాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి లో నియంత పాలన జరుగుతోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి

తిరుపతిలో డెడ్‌బాడీల కలకలం

ఏపీ బీజేపీ కొత్త బాస్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్?

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 02:02 PM