Nellore: నెల్లూరు జిల్లాలో రెండు ప్రమాదాల్లో 65 మందికి గాయాలు
ABN , Publish Date - May 12 , 2025 | 05:22 AM
నెల్లూరు జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 65 మంది గాయపడ్డారు. కందుకూరులో కూలీల ట్రక్కు బోల్తా పడగా, రాపూరులో భక్తులతో వెళ్ళిన ఆటో ప్రమాదానికి గురైంది
కందుకూరు/ రాపూరు, మే 11(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలో ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 65 మంది గాయపడ్డారు. కందుకూరు-పొన్నలూరు రహదారిలో ముత్తరాసుపాలెం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కందుకూరుకి చెందిన 30 మంది కూలీలు గాయపడ్డారు. వ్యవసాయ పనుల కోసం కూలీలు వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులకు కందుకూరు ఆసుపత్రిలోనూ, వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కాగా.. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పెరియారవరం గ్రామానికి చెందిన భక్తులు పెంచల కోన బ్రహ్మోత్సవాలకు వస్తుండగా, రాపూరు మండలం గోనుపల్లి వద్ద బైక్‌ను తప్పించే యత్నంలో ఆటో తిరగబడింది. అందులోని సుమారు 35 మందికిపైగా గాయాలు కాగా, 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి..
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్
For Andhrapradesh news and Telugu News