Biryani Orders : సెకనుకు 3 బిర్యానీలు..రికార్డు సృష్టించిన హైదరాబాద్

ABN, Publish Date - Dec 27 , 2024 | 09:46 PM

Biryani Orders: స్నేహితులు కలిస్తేనో.. ఇంట్లో వంటచేసుకోని సందర్భాల్లోనో బయట ఫుడ్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. అలాంటప్పుడు అందరు ఠక్కున చెప్పేది బిర్యానీ. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది.

స్నేహితులు కలిస్తేనో.. ఇంట్లో వంటచేసుకోని సందర్భాల్లోనో బయట ఫుడ్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. అలాంటప్పుడు అందరు ఠక్కున చెప్పేది బిర్యానీ. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో వెలువరించిన వార్షిక నివేదికలోనూ ఇదే తేలింది. ఈ ఏడాది తమ దగ్గర డెలివరీ అయిన ఫుడ్ డెలివరీల్లో బిర్యానీ టాప్ ప్లేస్‌లో నిలిచిందని రిపోర్ట్ ఇచ్చింది. 2024 ఏడాదికి సంబంధించి హియర్ ఎండ్ రిపోర్టును జోమాటో విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా డెలివరీ చేసిన ఫుడ్ ఐటమ్స్‌లో డైలీ ట్రెండ్స్‌ను ప్రస్తావించింది.


జోమాటాలో వరుసగా తొమ్మిదోవ ఏడాది కూడా బిర్యానీనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఏడాది అత్యధికంగా తొమ్మిది కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. అంటే సగటున ప్రతిసెకనుకు మూడు బిర్యానీల చొప్పున డెలివరీ చేసినట్లు జోమాటో తన నివేదికలో తెలిపింది. మరో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం స్విగ్గీలో కూడా బిర్యానీనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. దీంతో బిర్యానీకి ఉన్నా క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. బిర్యానీల తర్వాత అత్యధికంగా డెలివర్రీ అయిన ఫుడ్ ఐటమ్ పిజ్జా. మొత్తం. 5. 84 కోట్ల పిజ్జాలను దేశవ్యాప్తంగా డెలివరీ చేసినట్లు తెలిపింది. జోమాటో వేదికగా 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కాఫీని డెలివరీ చేసినట్లు హియర్ ఎండ్ రిపోర్ట్‌ను జోమాటో ఇచ్చింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 27 , 2024 | 10:14 PM