హైదరాబాద్‌లో వర్షాలు నీటిలో పలు కాలనీలు..
ABN, Publish Date - Sep 02 , 2024 | 01:47 PM
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నిజాంపేటలోని అపార్టుమెంట్లు అన్నీ జలమయం అయ్యాయి. సెల్లార్‌లోకి నీరు చేరడంతో మోటార్లసాయంతో బయటకు తోడుతున్నారు.
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. నిజాంపేటలోని అపార్టుమెంట్లు అన్నీ జలమయం అయ్యాయి. సెల్లార్‌లోకి నీరు చేరడంతో మోటార్లసాయంతో బయటకు తోడుతున్నారు. ప్రతి చిన్న వర్షానికి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకున్నవారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జై దీపిక కాలనీలో ఉన్న అపార్ట్‌మెంట్ సెలర్ నీటి మయం అయింది. సెల్లార్ నుంచి నీరు మోటర్లతో బయటికి పంపుతున్నారు.
కాగా తెలంగాణకు వాన గండం తప్పింది. బంగాళాఖాతంలో వాయుగుండం పూర్తిగా బలహీన పడింది. తెలంగాణలో సోమవారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ఇక మంగళవారం నుంచి తెలంగాణలో మోస్తరు వర్షాలే కురుస్తాయి. హైదరాబాద్‌లో ఈరోజు మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. కాగా రాష్ట్రానికి ఐఎండీ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూలిన ఇంటి గోడ.. కుటుంభసభ్యులు గల్లంతు..
హోంమంత్రి ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు..
విజయవాడ -హైదరాబాద్ హైవేపై వరద ఉధృతి
తెలంగాణలో వర్షాలకు 10 మంది మృతి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 02 , 2024 | 01:50 PM